Friday, May 27, 2016

జాతీయ వ్యక్తులు:

నినాదం         వ్యక్తి    

» గోబ్యాక్ టు వేదాస్ (వేదాలకు మరలండి)    -    స్వామి దయానంద సరస్వతి    

» నాకు రక్తాన్ని ఇవ్వండి - మీకు నేను స్వాతంత్య్రం ఇస్తాను    -    సుభాష్ చంద్రబోస్

» ఢిల్లీ చలో    -    సుభాష్ చంద్రబోస్    

» జైహింద్    -    సుభాష్ చంద్రబోస్

» జై జవాన్, జై కిసాన్    -    లాల్‌ బహదూర్ శాస్త్రి    

» సత్యం, అహింస నాకు దేవుళ్లు    -    మహాత్మా గాంధీ    

» డూ ఆర్ డై (చేయండి లేదా చావండి)    -    మహాత్మా గాంధీ

» బెంగాల్ విభజన దినం బ్రిటిష్ సామ్రాజ్య పతన దినం    -    మహాత్మా గాంధీ    

» బెంగాల్ విభజన తరువాత దేశంలో అసలైన చైతన్యం మొదలైంది    -    మహాత్మా గాంధీ    

» సంస్కారం లేని చదువు వాసనలేని పువ్వులాంటిది    -    మహాత్మా గాంధీ    

» ది వేదాస్ కంటైన్ ఆల్ ది ట్రూత్    -    స్వామి దయానంద సరస్వతి    

» భారతదేశం, భారతీయుల కొరకే    -    స్వామి దయానంద సరస్వతి    

» ఆర్య సమాజం నా తల్లి, వైదిక ధర్మం నా తండ్రి    -    లాలా లజపతిరాయ్    

» కాంగ్రెస్ ఉద్యమం ప్రజల చేత ప్రభావితమైంది కాదు, ప్రజలు ప్రణాళిక చేసిందీ కాదు    -    లాలా లజపతిరాయ్    

» ముందుకు సాగండి    -    మేడం బికాజికామా    

» నిజాలను నిర్లక్ష్యం చేస్తే అవి రెట్టింపు శక్తితో ప్రతీకారం తీర్చుకుంటాయి    -    సర్దార్ వల్లభాయ్ పటేల్

» రోజ్‌గార్ బడావో    -    మన్మోహన్‌సింగ్    

» జై విజ్ఞాన్    -    అటల్‌బిహారి వాజ్‌పేయి    

» భారతదేశానికి హిందువులు, ముస్లింలు రెండు కళ్లులాంటివారు    -    సర్ సయ్యద్ అహ్మద్‌ఖాన్

» రాజకీయ స్వేచ్ఛ అన్నది జాతికి ప్రాణ వాయువులాంటిది    -    అరబిందో ఘోష్    

» ప్రజలే ప్రభువులు    -    లోక్‌సత్తా    

» ఆనకట్టలే ఆధునిక దేవాలయాలు    -    జవహర్‌లాల్ నెహ్రూ    

» ప్రతి కంటి నుంచి కారే కన్నీటిని తుడవడమే నా అంతిమ లక్ష్యం    -    జవహర్‌లాల్ నెహ్రూ

» చెడును సహిస్తే అది మొత్తం వ్యవస్థనే నాశనం చేస్తుంది    -    జవహర్ లాల్ నెహ్రూ    

» ప్రపంచం ఒక పద్మవ్యూహం, కవిత్వం ఒక తీరని దాహం    -    శ్రీశ్రీ    

» భారతదేశం నేర్చుకోవాల్సిన ఒకే ఒక్క పాఠం ఏమిటంటే ఎలా చావాలో, దాన్ని బోధించవలసిన ఏకైక పద్ధతి చావడం ద్వారానే    -    ఎం.కె. ధింగ్రా

» ఇంక్విలాబ్ జిందాబాద్ (విప్లవం వర్ధిల్లాలి)    -    భగత్‌సింగ్    

» స్వరాజ్యం నా జన్మహక్కు, దాన్ని సాధించి తీరుతాను    -    బాలగంగాధర తిలక్    

» దేవుడు అంటరానితనాన్ని సహిస్తే నేను ఆయన్ను దేవునిగా అంగీకరించను    -    బాలగంగాధర తిలక్    

» పిచ్చాసుపత్రుల వెలుపల ఉండే పిచ్చివాళ్లు మాత్రమే స్వాతంత్య్రం గురించి ఆలోచిస్తారు, మాట్లాడతారు    -    గోపాలకృష్ణ గోఖలే    

» ఆధునిక విద్య, విజ్ఞానాల్ని ఆర్జించకుండా మన జాతి పురోగమించటం సాధ్యం కాదు    -    రాజారామ్మోహన్‌రాయ్    

» కళ కళ కోసం కాదు ప్రజల కోసం    -    బళ్ళారి రాఘవ    

» గాంధీ మరణించవచ్చు కానీ గాంధీయిజం ఎప్పుడూ జీవించే ఉంటుంది    -    భోగరాజు పట్టాభి సీతారామయ్య    

» దేశ్ బచావో, దేశ్ బనావో    -    పి.వి.నరసింహారావు    

» వడగాల్పులు నా జీవితం అయితే వెన్నెల నా కవిత్వం    -    గుర్రం జాషువా    

» ఒకే దేశం, ఒకే దేవుడు, ఒకే కులం, ఒకే ఆలోచన తేడా ఏమీ లేకుండా అనుమానమేమీ లేకుండా మేమందరం అన్నదమ్ములం    -    వి.డి.సావర్కర్

» నా తెలంగాణ కోటి రతనాల వీణ    -    దాశరథి కృష్ణమాచార్యులు    

» బోదెను చేధిస్తే ఎండిన కొమ్మలు వాటంతటవే పడిపోతాయి    -    బాజీరావు I

» చిన్న లక్ష్యాలు నిర్దేశించుకోవడం నేరం, గొప్ప కలలు కనండి, వాటి సాకారానికై కృషిచేయండి    -    ఎ.పి.జె. అబ్దుల్ కలాం    

» పాలిత దేశంలో కాకుండా స్వతంత్ర దేశంలో నన్ను దీర్ఘ నిద్ర పోనివ్వండి    -    మోతీలాల్ నెహ్రూ    

» నాలో చివరి రక్తపు బొట్టు వరకు ప్రజల కోసం పోరాడతాను    -    ఇందిరాగాంధీ    

» అవసరమైతే చిరిగిన చొక్కా తొడుక్కో కానీ ఒక మంచి పుస్తకం కొనుక్కో    -    కందుకూరి వీరేశలింగం పంతులు

» బ్రిటిష్ సామ్రాజ్య భావమే మాకు విరోధి, బ్రిటిష్ ప్రజలతో మాకు వైరం లేదు    -    మౌలానా అబుల్ కలాం ఆజాద్    

» ప్రత్యేక రక్షణలు కోరుతున్న ముస్లింలు ఎంత మూర్ఖులో వాటిని ఇస్తున్న హిందువులు అంతకంటే పెద్ద మూర్ఖులు    -    మౌలానా అబుల్ కలాం ఆజాద్    

» బికారీ హఠావో    -    రాజీవ్ గాంధీ    

» వాణి నా రాణి    -    పిల్లలమర్రి పినవీరభద్రుడు    

» బ్రిటిషర్ల ఫించను పొందుతున్న రాజుల, నవాబుల జాబితాలో బతకటం కంటే సైనికుడిగా మరణించటమే మేలు    -    టిప్పుసుల్తాన్    

» సూర్యుడు కనపడలేదని కన్నీరు పెడుతూ ఉంటే చివరకు నక్షత్రాలు కూడా కనపడకుండా పోతాయి    -    రవీంద్రనాథ్ ఠాగూర్    

» స్వాతంత్య్రం అనేది ఓ కనిపించని మహా అదృష్టం, అది లేనప్పుడు గాని దాని విలువ తెలియదు    -    రవీంద్రనాధ్ ఠాగూర్

» అందరిలోనూ సామాన్యున్ని అయినా చిరంజీవుణ్ణి    -    సి.నారాయణరెడ్డి    

» కులం పునాదులపై ఒక జాతిని గాని ఒక నీతిని గాని నిర్మించలేము    -    బి.ఆర్. అంబేడ్కర్    

» మహారాష్ట్రులనంతా ఒకచోట చేర్చు. మతం మరలా జీవించేటట్లు చూడు. మనల్ని చూచి మన పూర్వులు స్వర్గం నుంచి నవ్వుతున్నారు    -    గురు రామదాస్ 

» మానవులందరూ నా బిడ్డలవంటివారు    -    అశోకుడు




అంతర్జాతీయం వ్యక్తులు:

నినాదం         వ్యక్తి    


» స్త్రీ వ్యక్తిత్వానికి మాతృత్వం ఎలాంటిదో జాతుల వికాసానికి యుద్ధం అలాంటిది    -    హిట్లర్    
» స్త్రీలకు ప్రసవం ఎలాంటిదో దేశానికి స్వాతంత్య్రం అలాంటిది    -    ముస్సోలిని    
» వ్యవసాయ రంగం అభివృద్ధి కోసం, ధాన్యం కోసం యుద్ధం    -    ముస్సోలిని    
» ప్రజలు విన్నట్లు స్వర్గం వింటుంది. ప్రజలు చూస్తున్నట్లు స్వర్గం చూస్తుంది    -    కన్ఫ్యూషియస్    
» నేను వచ్చాను, నేను చూశాను, నేను జయించాను    -    జూలియస్ సీజర్    
» నాలెడ్జ్ ఈజ్ వపర్    -    జె.ఎల్.మిల్    
» భూమిపై పుట్టే ప్రతి వ్యక్తి ఆర్థికంగా నరకాన్ని సృష్టించినవాడవుతాడు    -    మాల్థస్    
» ది రూట్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆర్ బిట్టర్ బట్ ఫ్రూట్స్ ఆర్ స్వీట్    -    అరిస్టాటిల్    
»ఎక్కడైతే ఆరోగ్యవంతమైన శరీరం ఉంటుందో అక్కడ ఆరోగ్యవంతమైన జ్ఞానం ఉంటుంది    -    అరిస్టాటిల్    
» నేనే రాజ్యాన్ని    -    లూయి XIV    
» నా తర్వాత ప్రళయం వస్తుంది    -    లూయి XV    
» స్వేచ్ఛగా జన్మించిన మానవుడు సర్వత్రా సంకెళ్లతో బంధించబడ్డాడు    -    రూసో    
» బ్యూటీ ఈస్ ట్రూత్ అండ్ ట్రూత్ ఈస్ బ్యూటీ    -    జాన్‌కీట్స్    
» నేను భారతదేశానికి యాత్రికునిగా రాలేదు గాంధీ పుట్టిన దేశానికి నా నివాళ్లు అర్పించడానికి వచ్చాను    -    మార్టిన్ లూథర్ కింగ్    
» బుల్లెట్ కంటే బ్యాలెట్ శక్తిమంతమైంది    -    అబ్రహం లింకన్    

» నీకు బానిసగా ఉండటానికి ఇష్టం లేనప్పుడు యజమానిగా ఉండటానికి కూడా ఇష్టపడకూడదు    -    అబ్రహం లింకన్
» ఇవ్వడానికి నా దగ్గర ఏమీలేదు. రక్తం, శ్రమ, కన్నీళ్లు తప్ప    -    విన్‌స్టన్ చర్చిల్    
» లిపి పుట్టుకే నాగరికతల ఆవిర్భావానికి చిహ్నం    -    గార్డెన్ చైల్డ్    
» శరీరానికి వ్యాయామం ఎలాంటిదో మనసుకు చదువు అలాంటిది    -    రాబర్ట్ స్టీల్    
» మతం మత్తుమందు వంటిది    -    కారల్‌మార్క్స్    
» పోరాడితే పోయేది ఏమీ లేదు బానిస సంకెళ్లు తప్ప    -    కారల్ మార్క్స్    

» చరిత్ర అంటే వర్గ పోరాటాల రికార్డే తప్ప మరేమీ కాదు    -    కారల్‌మార్క్స్
» ప్రపంచ కార్మికులారా ఏకంకండి    -    కారల్ మార్క్స్    
» అలవాటు అనే పదాన్ని అరికట్టకపోతే అది అవసరంగా మారుతుంది    -    సెయింట్ అగస్టీన్    
» జన్మతః బ్రిటిష్‌వారు పాలకులు, హిందూ దేశస్థులు పాలింపబడేవారు మాత్రమే    -    కారన్‌వాలిస్    
» నూరు పువ్వులు వికసించనీ, వెయ్యి ఆలోచనలు సంఘర్షించనీ    -    మావో సేటుంగ్    
» నేనే విప్లవాన్ని, నేనే విప్లవ శిశువుని    -    నెపోలియన్    
» అసాధ్యం మూర్ఖుల నిఘంటువులో మాత్రమే కనిపించే పదం    -    నెపోలియన్    
» ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న సర్వ అరిష్టాలు లండన్‌లోనే ఉద్భవిస్తాయి    -    నెపోలియన్    
» చైనా నిద్రావస్థలో ఉన్న పెనుభూతం. దానికి మెలకువ వచ్చిన రోజు ప్రపంచంపై పాశ్చాత్య దేశాలు పెత్తనం అంతమవుతుంది    -    నెపోలియన్    
» సంగీత విద్వాంసుడు ఫిడేలును ప్రేమించినట్లు నేను అధికారాన్ని ప్రేమిస్తాను    -    నెపోలియన్    
» పవిత్ర రోమన్ సామ్రాజ్యం పవిత్రం కాదు, అసలది పవిత్ర రోమన్ సామ్రాజ్యమే కాదు    -    నెపోలియన్    
» గివ్ మి స్పేస్ టు స్టాండ్ అవే ఫ్రమ్ ద ఎర్త్ అండ్ ఐ షల్ లిఫ్ట్ దిస్ ఎర్త్    -    ఆర్కిమెడిస్    
» భారతదేశ వ్యాపారమే ప్రపంచ వ్యాపారమన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఎవరైతే ఆ దేశాన్ని తమ ఆధిప్యతంలో ఉంచుకోగలరో వారే ఐరోపాను నిరంకుశంగా పరిపాలించగలరు    -    రష్యా పీటర్ చక్రవర్తి    
» ఆహారం కంటే ఫిరంగులే ముఖ్యం    -    గోరింగ్ (హిట్లర్ అనుచరుడు)    
» కంటికి కన్ను పంటికి పన్ను    -    బాబిలోనియా నాగరికత    
» రాజు భగవంతుని వారసుడు, చట్టం రాజు నుంచి ఆవిర్భవిస్తుంది    -    జేమ్స్ I    
» యుద్ధం ప్రష్యా దేశంలో ఒక జాతీయ పరిశ్రమ    -    మిరాబో    
» ది గ్రేట్ వాల్ ఆఫ్ చైనా ముందు ఈజిప్టు పిరమిడ్లు వెలవెలబోతాయి    -    వోల్టెర్    
» సంతృప్తి చెందిన మూర్ఖుని కంటే అసంతృప్తితో ఉన్న సోక్రటీస్ నయం    -    జె.ఎల్. మిల్    
» ఈ సెబాస్టపోల్ బురద నుంచి నూతన ఇటలీ ఉత్పన్నమవుతుంది    -    కౌంట్ కవూర్    
» నేను ఉపన్యాసాన్ని ఇవ్వలేను కానీ ఇటలీని సమైక్యపరచగలను    -    కౌంట్ కవూర్    
» ప్రాచీన చరిత్ర రచనకు ఉపయోగపడే మానవ అస్థిపంజరాలు, పుర్రెలు, శిలాజాలు అనే ఆధార వస్తువుల్ని ప్రాచీన కాలం మనుషులుగా వర్ణించవచ్చు    -    మార్టిమర్ వీలర్    
» ప్రపంచ ఆధిపత్యమో లేదా పతనమో    -    రెండో కైజర్ విలియం    
» నేను న్యాయాన్ని ప్రేమించాను, అన్యాయాన్ని నిరసించను. అందువల్లే ఈ విధంగా ప్రవాసంలో మరణిస్తున్నాను    -    గ్రేగరి VII    
» విప్లవం రోగం వంటిది, అగ్ని పర్వతంలాంటిది, పుట్టుకురుపు వంటిది    -    ఎటర్నిక్    
» మానవ పరిణామ క్రమాన్ని ఒక గంట సినిమాగా తీస్తే అందులో 59 నిమిషాలు శిలాయుగానికే సరిపోతుంది